కోనసీమ: ఆధునిక కాలంలో పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల విలువ తెలియాలంటే వారి నుంచి సెల్ ఫోన్లను దూరం చేయాలని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. తుమ్మలపల్లిలో శుక్రవారం స్కూల్ వార్షికోత్సవ వేడుకలో సీఐ మాట్లాడారు. పిల్లల్లో ప్రేమ, ఆప్యాయతలను సెల్ ఫోన్ దూరం చేస్తోందన్నారు. అందుకే ఎన్ని పనులున్నా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలన్నారు.