SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బుధవారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మంత్రిని కలిసి విన్నవించారు. పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.