WNP: ఉపాధి హామీ కూలీలకు మూడు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్సై డిమాండ్ చేశారు. మదనాపురం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ముందు కూలీలతో కలిసి ఆందోళన చేపట్టారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించి బకాయిలు చెల్లించాలని ఏపీవో బాలయ్యకు వినతి పత్రం అందజేశారు.