MBNR: నవాబుపేట మండలం ఇప్పటూరులో విషాదం జరిగింది. భార్య పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చంద్రయ్య(66) నిద్రలోనే మృతి చెందారు. ఆయన ఇల్లు ఊరి చివరన ఉండటంతో మూడు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. శుక్రవారం దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు తలుపులు తీసి చూడగా విగతజీవిగా కనిపించారు. నిద్రలో గుండెపోటు రావడమే మరణానికి కారణమని భావిస్తున్నారు.