అన్నమయ్య: సాగునీటి సంఘ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని రామసముద్రం MRO నిర్మలాదేవి సూచించారు. తన కార్యాలయంలో జలవనరులశాఖ AE శ్రీధర్, గ్రామ వీఆర్వోలతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. త్వరలోనే ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. మండలంలోని పలు చెరువులకు సంబంధించి సాగునీటి సంఘ ఎన్నికలు త్వరలో జరుగుతాయన్నారు.