KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.