KNR: కరీంనగర్లోని కార్ఖానా గడ్డ హిందూ శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ కోరారు. గురువారం బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయికి వినతిపత్రం అందజేసి, రాత్రివేళల్లో ఉపయోగపడేలా సముచిత లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నీటి సమస్యలు నివారించేందుకు 3 కొత్త బోర్లు తవ్వించాలని సూచించారు.