MHBD: ప్రజల సౌకర్యార్థం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మార్వో నాగరాజు తెలిపారు. ఆధార్ నమోదు మార్పులు,చేర్పులు, నవీణీకరణ, ఫొటో అప్డేట్లు, మొబైల్ నంబర్ ఆధార్‌కు లింకు వంటి సేవలను ఉండవచ్చని ఎమ్మార్వో పేర్కొన్నారు. కాగా ఆధార్ సంబంధిత పనులను ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.