ATP: అనంతపురంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొని మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగను భువికి తెచ్చిన భగీరథుడి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు.