NLR: గర్భిణీలు పోషకాహారం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ పద్మావతి తెలిపారు. బుచ్చి మండలంలోని రేబాల ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్వాడి పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్త భారతీ ఆధ్వర్యంలో 8 వ పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు సరైన సమయంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.