W.G: తాడేపల్లిగూడెం(M) మోదుగగుంట సచివాలయంలో భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీలత మాట్లాడుతూ.. గంగమ్మను భూమికి తెచ్చిన మహనీయుడు భగీరథుడని, నేటి యువత ఆయన పట్టుదలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అసాధ్యమైన పనులను భగీరథ ప్రయత్నంతో సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.