AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా SPDCL కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామకపత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టాం. విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాం. విద్యుత్ శాఖపై మాట్లాడే హక్కు YCPకి లేదు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపై YCP భారం మోపింది’ అని పేర్కొన్నారు.