KRNL: ఆలూరులో ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని బీకేఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే. భూపేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26-28 వరకు తిరుపతిలో జరిగే సభల్లో కార్మిక సమస్యలు, కనీస వేతనాలు, హమాలీ సంక్షేమ బోర్డుల ఏర్పాటు అంశాలపై చర్చిస్తారని తెలిపారు.