NTR: విజయవాడ సివిల్ కోర్టులో గురువారం లిఫ్ట్ సాంకేతిక లోపంతో 8వ అంతస్తు వద్ద నిలిచిపోవడంతో పలువురు న్యాయవాదులు గంటన్నరపాటు అందులో ఇరుక్కుపోయారు. ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం కోసం SDRF, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని లిఫ్ట్‌లోకి ఆక్సిజన్ పంపించారు. లిఫ్ట్‌లో గర్భిణీ మహిళ ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.