గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పొన్నూరు రోడ్డులో ఏర్పాటు చేసిన టీబీసీ సెంటర్ను పరిశీలించారు. అక్కడ చేపడుతున్న కుక్కల వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. నగరంలో కుక్కల సమస్య తగ్గించే దిశగా చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.