కృష్ణా: యువత నూతన ఆవిష్కరణలతో ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా కోర్సులు ఎంచుకోవాలన్నారు. విద్యకు తోడు వినయం, సత్ప్రవర్తన, వినయ విధేయతలు, మానవత్వం అలవర్చుకోవాలన్నారు.