NTR: ఏ. కొండూరు(M)లో డిజిటల్ జనగణనపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చైతన్య నగర్ తండా పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ జనగణన కార్యక్రమంలో ఈ మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు.