NGKL: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ డిపోను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా సేవలు దెబ్బతినకుండా ప్రత్యేక దృష్టి సారించాలని డిపో మేనేజర్‌కు స్పష్టం చేశారు. సమ్మె పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.