JGL: కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో సీతారామ చంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. కథలపూర్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.