MLG: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమంలో భాగంగా ఫైర్ అవేర్నెస్ను అధికారి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. ఫంక్షన్లు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 101కు కాల్ చేసి ప్రజలను సురక్షితంగా బయటకు తరలించాలన్నారు.