NDL: ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన న్యాయవాది ఉప్పలపాటి ప్రతాప్ బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానం చేశారు. నూతన బాధ్యతలను నిబద్ధతతో, పక్షపాతం లేకుండా నిర్వర్తిస్తూ పేద, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం అందించాలని ఆమె సూచించారు.