ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు బుధవారం రాత్రి గ్రామసభలు నిర్వహించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్, స్త్రీరక్ష పోర్టల్ సేవలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, గంజాయి కట్టడి, రోడ్డు భద్రతపై ప్రజలకు వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.