NRML: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నతో కలిసి జుమ్మెరాత్పేట్, కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలు, భద్రత ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.