PDPL: ముత్తారం మండలం పోతారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కటకం శ్రీనివాస్ పాఠశాలపై ప్రేమతో నేమ్ బోర్డు ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు ప్లేట్స్, కంపాస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా HM సత్తయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ చైర్ పర్సన్ పద్మ, శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.