NZB: ధర్పల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుల బంద్ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రతకు తోడు బస్సులు రాకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.