ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల మొదటి వారంలో టన్ను ధర రూ.23 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.40 వేలకు చేరింది. తోటల వద్దే వ్యాపారులు టన్ను రూ.50 వేలకు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్కు కాయల రాక తగ్గింది. మంగళవారం కేవలం 525 టన్నుల దిగుమతి మాత్రమే జరిగినట్లు ఇన్ఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.