నారాయణపేట జిల్లా మద్దూర్ బస్టాండ్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కోస్గి, నారాయణపేట డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.