WGL: భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజాము నుంచే అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు నిర్వహించి, విశేష అలంకరణలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.