NRPT: నారాయణపేట పట్టణంలో మంగళవారం ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలకు, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో నడపడం తదితర కారణాలతో 45 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 47 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.