TG: కేసీఆర్, బీఆర్ఎస్ అనే ఛాప్టర్ తెలంగాణలో ముగిసిన అధ్యాయమని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అనే నోటు చెల్లదని తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారన్నారు. జీవన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.