AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా ఈనెల 24న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.