BHPL: పట్టణంలోని సెగ్గంపల్లి గ్రామ వాస్తవ్యుడు, BRS నాయకులు జనగాం చిరను తల్లి బాణమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి మృతురాలి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం చిరను కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.