NRML: సోన్ మండలంలోని పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్స్ సంస్థ CSR కింద రూ. 1 లక్ష విలువైన ఐదు కంప్యూటర్లను మంగళవారం అందజేసింది. విద్యార్థులు సాంకేతిక విద్యలో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.