W.G: తణుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వేల్పూరులో నిర్వహించిన పోషణ్ పఖ్వాడాలో సీడీపీవో శ్రీలక్ష్మి పాల్గొని, బిడ్డకు రెండేళ్ల వరకు అందించాల్సిన పోషకాలపై తల్లులకు అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్స్ మానుకోవాలని, స్థానికంగా దొరికే బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లులు, కార్యకర్తలు పాల్గొన్నారు.