MDCL: మాయూర్ పూరోహిత్ (7) అనే బాలుడు నిన్న సాయంత్రం కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, బాలుడు మిలిటరీ డెయిరీ ఫారం రోడ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కేవలం 45 నిమిషాల్లో శోభా గార్డెన్స్ వద్ద బాలుడిని గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.