NRPT: రైతు భరోసా పథకం రెండో విడత కింద జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.66.78 కోట్లు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదల కార్యక్రమాన్ని జాజాపూర్ రైతు వేదికలో అధికారులు, రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. జిల్లావ్యాప్తంగా 38 రైతు వేదికల్లో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.