ఇరాన్‌పై ప్రతిదాడి చేస్తే ఆ తర్వాత చోటు చేసుకొనే పరిణామాలకు ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుందని ఐఆర్జీసీ చీఫ్ హసన్ సలామీ హెచ్చరించారు. ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఓ జనరల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హుతీ మిలిటెంట్లపై అమెరికా బీ-2 బాంబర్లతో భారీ దాడి చేసింది. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.