ASF: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.