AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు పేర్కొన్నారు.