SRCL: వాతావరణంలో మార్పుల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ముందు జాగ్రత్తగా చేతికందించి ధాన్యాన్ని కాపాడుకునే పనిలోపడ్డారు. శనివారం సాయంత్రం జోగాపూర్, మర్రిగడ్డ, సనుగుల, దేవుని తండా తదితర గ్రామాల్లో చిరుజల్లులు పడటంతో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగా పోసి టార్పెరిన్ కవర్లు కప్పారు.