MDCL: ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, ఐఏఎస్ అధికారి చౌదరి కలిసి ఎంటమాలజీ విభాగ సిబ్బందితో సమావేశమయ్యారు. వారి రోజువారీ పనితీరును సమీక్షించి, ప్రస్తుత కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. దోమల నివారణ చర్యలు, ఫీల్డ్ స్థాయి పనుల అమలు పట్ల దృష్టి సారించాలని సూచించారు. విభాగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.