SDPT: హుస్నాబాద్ 18 వార్డు బుడగ జంగాల కాలనీలో ఎట్టకేలకు చీకట్లు తొలగిపోయాయి. గత కొంతకాలంగా వీధి దీపాలు లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వార్డు కౌన్సిలర్ వాలా సుప్రజా నవీన్ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు అమర్చారు. అనంతరం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో స్థానికులకు వెలుతురు ఎంతో ఊరట ఇవ్వనుంది.