IPL 2026లో KKR ఆడిన 6 మ్యాచుల్లో ఒక్కటీ గెలవని సంగతి తెలిసిందే. దీంతో ఓ సీజన్ తొలి 6 మ్యాచుల్లో ఒక్క విజయం కూడా అందుకోని ఐదో జట్టుగా నిలిచింది. KKR కంటే ముందు 2012లో డెక్కన్ ఛార్జర్స్, 2013లో ఢిల్లీ, 2019లో RCB, 2022లో ముంబై ఇలాంటి ప్రదర్శనే చేశాయి. అటు 2009లో 9 వరుస ఓటముల తర్వాత KKRకు ప్రస్తుతం 7 మ్యాచుల లూజింగ్ స్ట్రీక్ నడుస్తోంది.