బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. తేజస్వి, కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ అవమానించవద్దంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.