SRPT: హుజూర్‌నగర్‌లోని గ్రీన్ వుడ్ పాఠశాలలో సీఐ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.