SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మరింగంటి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, వాహన సేవలు, భక్తులకు ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.