WNP: వనపర్తి మండలంలోని ఆరేపల్లిలో చేపల, రొయ్యల చెరువులను పెబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థులు సందర్శించారు. కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న వారికి ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద సందర్శించినట్లు ఆచార్యులు డాక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. చేపలు, రొయ్యల పెంపకం, వాటికి సోకే వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మత్స్య కార్మికుడు ఆనంద్ వివరించారు.