KMM: నవసకం ఆధ్వర్యంలో మధిర మండలం సిరిపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. వారితోపాటు గ్రామీణ వైద్యులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.