VSP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఇవాళ రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం ధ్వజారోహణం, కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహాలు, రథోత్సవంను ఆలయ కమిటీ సభ్యలు చేపట్టనున్నారు. రాత్రి 10.30 గంటలకు తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.