ఖమ్మం: నగర మాజీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జావిద్ మరణ వార్త విన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్ననే ఖమ్మం సమావేశంలో ఆయనను సన్మానించామని, ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరమని ఆయన క్రమశిక్షణ గల నాయకుడని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.